ఏప్రిల్ 14న 'కబాలి' టీజర్ విడుదల

- March 14, 2016 , by Maagulf
ఏప్రిల్ 14న  'కబాలి' టీజర్ విడుదల

తమిళ నాట కొత్త సంవత్సరానికి సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం 'కబాలి' టీజర్ రిలీజ్ చేయబోతున్నారట..అదేంటీ కొత్త సంవత్సరం దాటి మూడు నెలలు కావస్తుంది ఇప్పుడు కొత్త సంవత్సరం ఏమిటా అనుకుంటున్నారా..? ఏప్రిల్ నెలలో తమిళ కొత్త సంవత్సర (ఏప్రిల్ 14న) తమిళ సినీ ప్రేమికుల ఆరాద్య దైవంగా భావించే రజినీకాంత్ కొత్త చిత్రం 'కబాలి' టీజర్ విడుదలవుతుందని నిర్మాత స్పష్టం చేశారు. గత కొంత కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మలేషియాల్ జరుపుకుంది. 'విక్రమ సింహ', 'లింగ' లాంటి రెండు వరుస పరాజయాల తర్వాత రజనీ కాంత్, తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన 'కబాలి', 'రోబో 2.0' అనే రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నారు. రజినీకాంత్ భాష చిత్రం తర్వాత ఆ తరహా మాఫియా డాన్ గా నటించ బోతున్న చిత్రం కబాలి. ఇప్పటికే ఈ చిత్రం పోస్టర్ రిలీజ్ కావడం దానిపై విపరీతమైన అంచనాలు పెరిగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నా అది కాస్త జాప్యం జరగడంపై తమిళ తంబీలు నిరుత్సాహ పడుతున్న నేపథ్యంలో నిర్మాత కళైపులి థాను ఏప్రిల్ నెలలో టీజర్ విడుదలవుతుందని ప్రకటించేశారు. రజనీ కెరీర్లో బాక్సాఫీస్ పరంగా ప్రభంజనం సృష్టించిన 'రోబో'కి సీక్వెల్ 'రోబో 2.0' కాగా, రియలిస్టిక్ సినిమాలతో తమిళనాట సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ తెరకెక్కిస్తోన్న గ్యాంగ్‌స్టర్ సినిమా 'కబాలి'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com