ఎయిర్‌పోర్టు అథారిటీలో ఉద్యోగావకాశాలు..

- August 25, 2021 , by Maagulf
ఎయిర్‌పోర్టు అథారిటీలో ఉద్యోగావకాశాలు..

ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సీనియ‌ర్ అసిస్టెంట్ పోస్టుల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.AAI రిక్రూట్‌మెంట్ 2021 ద్వారా ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.వీటికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అధికారి వెబ్‌సైట్https://www.aai.aero/en ఉన్నాయి.ప‌లు విభాగాల్లో క‌లిపి మొత్తం 29 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు సంబంధించి అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి విష‌యాలు తెల‌సుకోండి.

అర్హ‌త‌లు ఇవే..

  • సీనియర్‌ అసిస్టెంట్‌(ఆపరేషన్స్) - ఈ పోస్టులకు అప్లే చేసుకునే వారు ఎల్‌ఎమ్‌వీ లైసెన్స్‌తో పాటు మేనెజ్‌మెంట్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
  • సీనియర్‌ అసిస్టెంట్‌ (ఫైనాన్స్) - బీకామ్‌ డిగ్రీతో పాటు సుమారు మూడు నుంచి ఆర నెలల వ్యవధిలో అర్హ‌మైన కంప్యూటర్‌ కోర్స్‌ చేసి ఉండాలి.
  • సీనియర్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్) - ఎలక్ట్రానిక్స్‌/టెలికమ్యూనికేషన్‌/రేడియో ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత క‌లిగి ఉన్న‌వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ముఖ్య‌మైన తేదీలు 
ద‌ర‌ఖాస్తుల ప్రారంభ‌తేదీ - జూలై 29, 2021
ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు చివ‌రి తేదీ - ఆగ‌స్టు 31, 2021

ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం
Step -1 : ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు అధికారి వెబ్‌సైట్‌(https://www.aai.aero/en)ను సంద‌ర్శించాలి.
Step -2 : నోటిఫికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి.
Step -3 : నోటిఫికేష‌న్‌లో తెలిపిన విధంగా అర్హ‌త‌లు క‌లిగిన అభ్య‌ర్థులు వారి వివ‌రాల‌ను ఈ-మెయిల్ ద్వారా పంపాలి.
Step -4 : అనంత‌రం పూర్తి బ‌యోడేటాను నోటిఫికేష‌న్‌లో ఇచ్చిన అడ్ర‌స్‌కు పంపాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com