“సర్కారు వారి పాట” గోవా షెడ్యూల్ పూర్తి
- August 26, 2021
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” సినిమా గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసారు. ఈ హీరో తన కుటుంబం, సోదరి మంజుల, స్నేహితురాలు, స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి ఈ రోజు ఉదయం చార్టర్డ్ విమానంలో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. 2 వారాల పాటు జరిగిన సుదీర్ఘ షెడ్యూల్లో దర్శకుడు పరశురామ్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, మహేష్, కీర్తిలతో పాటు ఇతర ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో జరుగుతుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” పేరుతో విడుదలైన ఈ బ్లాస్టర్ కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్ వచ్చాయి.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







