హైదరాబాద్ ఎయిర్ కార్గోలో నెక్ట్-జనరేషన్ ఎన్విరోటైనర్ రిలై RLP కంటైనర్లు

- August 26, 2021 , by Maagulf
హైదరాబాద్ ఎయిర్ కార్గోలో నెక్ట్-జనరేషన్ ఎన్విరోటైనర్ రిలై RLP కంటైనర్లు

హైదరాబాద్: భారతదేశం & దక్షిణాసియా ప్రాంతంలో నెక్ట్స్ జనరేషన్  ‘‘ఎన్విరోటైనర్‌ రిలై RLP ఎయిర్ కార్గో కంటైనర్ల’’ను ఉపయోగించే మొదటి కార్గో టెర్మినల్‌గా నిలిచామని GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో నేడు ప్రకటించింది. 

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టెంపరేచర్ సెన్సిటివ్ ఎయిర్ కార్గో షిప్‌మెంట్‌లను తరలించడానికి ఎన్విరోటెయినర్ యాక్టివ్, పాసివ్ కూల్డ్ కంటైనర్లను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు.  ఔషధాలు, వ్యాక్సిన్‌ల సప్లై చెయిన్‌లో ఎలాంటి ఆటంకమూ లేకుండా ఉష్ణోగ్రతలను నియంత్రించాల్సిన అవసరముంది. 

రిలై RLP అనేది ఎన్విరోటైనర్ ప్రవేశపెట్టిన నెక్ట్స్ జనరేషన్ టెంపరేచర్ కంట్రోల్డ్ ఎయిర్ కార్గో కంటైనర్. అత్యుత్తమ పనితీరును అందించే ఈ కంటెయినర్ 50% అధిక స్థల సామర్థ్యం, అధునాతన పర్యవేక్షణ కలిగినది. ఇది 170 గంటల వరకు రవాణా ఉష్ణోగ్రతని నిర్వహించడానికి అసమానమైన సామర్థ్యాన్ని అందిస్తుంది - ఇది ప్రపంచంలోనే అత్యధికం.

RLP కంటైనర్‌ల కోసం GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో ఎన్విరోటైనర్ బృందం మరియు భాగస్వామ్య ఎయిర్‌లైన్స్‌తో కలిసి అన్ని మౌలిక సదుపాయాలను సమర్థంగా ఏర్పాటు చేసింది.  రిలై RLP కంటెయినర్లతో ఇప్పుడు భారతదేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు, ఇతర రవాణాదారులు తమ టెంపరేచర్ సెన్సిటివ్ కార్గోను సులభంగా, సమర్ధవంతంగా తరలించగలుగుతారు.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ప్రాంతం ముందంజలో ఉన్నందున, రిలై  RLP కంటైనర్లను ప్రవేశపెట్టడం వల్ల ఈ వ్యాక్సిన్ల రవాణాలో గ్లోబల్ సప్లై చెయిన్ మరింత బలోపేతం అవుతుంది.

GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ CEO ప్రదీప్ పణికర్, “భారతదేశ మార్కెట్‌లో అధునాతన రిలై RLP కంటైనర్‌లను ప్రవేశపెట్టడానికి ఎన్‌విరోటైనర్‌తో భాగస్వామి కావడం మాకు ఆనందంగా ఉంది. కొత్త కంటైనర్లు వాటి అధునాతన ఫీచర్లు, సామర్థ్యాలతో ఈ ప్రాంతంలోని ఎయిర్ కార్గో షిప్పర్స్, కన్సైనీలకు అసమానమైన విలువను అందిస్తాయి. హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్‌లోని మా ఎన్విరోటైనర్ హబ్ ఇప్పుడు కస్టమర్ల తరపున ఈ నెక్ట్స్ జనరేషన్ కంటైనర్‌లను స్వీకరించడానికి, పంపడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది.’’ అన్నారు.

ఎన్విరోటైనర్ టెంపరేచర్ కంట్రోల్డ్ ఎయిర్ కార్గో కంటైనర్‌లకు GHAC ప్రాంతీయ హబ్ మరియు భాగస్వామిగా ఉంది. GHAC ఎయిర్‌పోర్ట్ కార్గో టెర్మినల్ ఈ ప్రాంతంలో ఎన్విరోటెయినర్ వినియోగదారుల కోసం 75 కంటైనర్ల వరకు నిలువ చేయగలదు. GHAC ఒక డెడికేటెడ్ ‘కూల్‌టైనర్ యార్డ్’ను కూడా అభివృద్ధి చేస్తోంది, ఇది భారతదేశంలోని అతిపెద్ద ఆన్-ఎయిర్‌పోర్ట్ హబ్‌గా అవతరిస్తుంది. యాక్టివ్, పాసివ్ టెంపరేచర్ కంట్రోల్డ్ కంటైనర్‌లను నిల్వ చేయడానికి, సర్వీస్ చేయడానికి, నిర్వహించడానికి, ఏ సమయంలోనైనా 250 కంటైనర్‌లను కలిగి ఉండే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC) భారతదేశంలో WHO-GSDP (ప్రపంచ ఆరోగ్య సంస్థ – మెరుగైన నిల్వ మరియు పంపిణీ పద్ధతులు) ద్వారా సర్టిఫై చేయబడిన విమానాశ్రయం. టెంరేచర్ సెన్సిటివ్ కార్గో నిర్వహణకు, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆటంకాలూ లేకుండా వాటిని సరఫరా చేయడానికి ఇది సదుపాయాలను కలిగి ఉంది. పెరిషబుల్స్, వ్యవసాయోత్పత్తులు, టెంపరేచర్ కంట్రోల్డ్ ఔషధాల కోసం GHAC ల్యాండ్‌సైడ్ మరియు ఎయిర్‌సైడ్‌లో తన మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. దీనిలో భాగంగా  ఎయిర్ సైడ్ రవాణా కోసం మొబైల్ రిఫ్రిజిరేటెడ్ యూనిట్ కూల్ డాలీని ప్రారంభించింది.ఇక్కడి నుంచి ప్రధానంగా పెరిషబుల్స్, (వ్యవసాయ మరియు సముద్ర ఉత్పత్తులు) ఔషధాలు, ఇంజనీరింగ్ & ఏరోస్పేస్, వస్త్రాలు మరియు ఎలక్ట్రానిక్స్ ఎగుమతి అవుతాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com