ఢిల్లీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్
- August 27, 2021
న్యూ ఢిల్లీ: లాక్డౌన్ సమయంలో చేసిన ఎంతో మందికి ఆపద్భాంధవుడిలా మారిన నటుడు సోనుసూద్ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా సమయంలోనే కాక ఇప్పటికీ కూడా తన సేవా కార్యక్రమాలను సోనూసూద్ కొనసాగిస్తున్నారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు ఇవ్వడం, అనారోగ్యం బారిన పడిన వారికి ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందించడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనూసూద్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుందంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సోనూసూద్ సమావేశం కావడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ అంశంపై సోనూసూద్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం దేశ్ కే మెంటర్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా తాను ఎంపికైనట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే 10 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయబోతున్నట్లు ప్రకటించారు. దానికోసమే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం అయ్యారని కానీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గతంలో మంత్రి కేటీఆర్‌తోనూ సోనూసూద్ భేటీ అయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







