షబు సరఫరా: మహిళకు ఐదేళ్ళ జైలు శిక్ష

- August 27, 2021 , by Maagulf
షబు సరఫరా: మహిళకు ఐదేళ్ళ జైలు శిక్ష

బహ్రెయిన్: డ్రగ్స్ పెడలింగ్ కేసులో మహిళకు ఐదేళ్లు జైలు శిక్ష, 3000 బహ్రెయినీ దినార్ల జరిమానాను న్యాయ స్థానం విధించగా, ఆ తీర్పును సదరు మహిళ పై కోర్టులో సవాల్ చేసింది. కానీ, ఆమెకు ఊరట దక్కలేదు. షబు పేరుతో పిలవబడే ఓ రకమైన డ్రగ్ ఆమె పాకిస్థాన్‌కి చెందిన వ్యక్తికి సరఫరా చేస్తుండగా, పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 100 గ్రాముల షబును ఆమె వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఆమె డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా కూడా విచారణలో అంగీకరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com