పైలట్‌కి అస్వస్థత: మస్కట్ - ఢాకా విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్

- August 28, 2021 , by Maagulf
పైలట్‌కి అస్వస్థత: మస్కట్ - ఢాకా విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్

మస్కట్: బిమాన్ బంగ్లాదేశ్ విమానం మస్కట్ నుంచి ఢాకా వెళుతుండగా, భారతదేశంలోని నాగపూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. పైలట్ గుండెపోటుకి గురికావడంతో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో విమానంలో 126 మంది ప్రయాణీకులు వున్నారు. పైలట్‌ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాయ్‌పూర్ సమీపంలో వుండగా పైలట్ గుండెపోటుకు గురికాగా, నాగపూర్ విమానాశ్రయంతో సంప్రదింపులు జరిపి అత్యవసరంగా ల్యాండ్ చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com