ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం..!

- August 29, 2021 , by Maagulf
ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం..!

హైదరాబాద్: ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి..ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.శాసన మండలి చైర్మన్‌ ఛాంబర్‌లో సురభి వాణీదేవితో మండలి ప్రొటెం చైర్మన్‌ వెన్నవరం భూపాల్‌ రెడ్డి.. ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌,రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎమ్మెల్సీ వాణిదేవికి శుభాకాంక్షలు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com