ఐసీయూలో 60కి తగ్గిన కోవిడ్ పేషెంట్ల సంఖ్య
- August 30, 2021
ఒమన్: ఒమన్ లో కోవిడ్ పేషెంట్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (ఐసీయూ) చికిత్స పొందుతున్న కోవిడ్ -19 పేషెంట్ల సంఖ్య 60కి తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించింది. గత మూడు రోజుల్లో సుల్తానేట్‌లో కొత్తగా 348 మంది కరోనా బారిన పడ్డారని, మరో 8 మంది కోవిడ్ సంబంధిత కారణాలతో మృతి చెందినట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ COVID-19 కేసుల సంఖ్య 302,132 కి చేరుకుంది. మరణాల సంఖ్య 4057 కి పెరిగింది. ఇక కోవిడ్ నుంచి 493 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం రికవరీల సంఖ్య 291,532 కు చేరుకుంది. ఇదిలాఉంటే..గత 24 గంటల్లో 13 మంది కోవిడ్ తో ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు 138 మంది ఉన్నారని, వీరిలో 60 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (ICU లు) చికిత్స పొందుతున్నారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







