స్కూళ్లలో మొబైల్ ఫోన్లకు షరతులతో కూడిన అనుమతి
- August 30, 2021
సౌదీ: ప్రత్యక్ష తరగుతల నిర్వహణకు అనుగుణంగా సౌదీ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో విద్యార్ధులు మొబైల్ ఫోన్లు తీసుకొచ్చేందుకు కొన్ని షరతులతో అనుమతించింది. కోవిడ్ నేపథ్యంలో విద్యార్ధులు, స్కూల్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు ప్రతి ఒక్కరు తవక్కల్నా యాప్ ద్వారా వ్యాక్సిన్ వివరాలను చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. వ్యాక్సిన్ వివరాలను మొబైల్ యాప్ లో చెక్ చేయాల్సి ఉంటుంది కనుక ఫోన్లను తీసుకొచ్చేందుకు పర్మిషన్ ఇస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్ధులకు, స్కూల్ సిబ్బందికి తగిన సూచనలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. అలాగే సేఫ్ వెదర్ లో తరగతుల నిర్వహణకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు..పాఠశాలల లోపల విద్యా ప్రక్రియను నిర్వహించడానికి ప్రత్యేకంగా కమిటీలు ఉన్నాయని విద్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అల్-షెహ్రీ చెప్పారు. ఈ సూచనలకు అనుగుణంగా కమిటీలు ఖచ్చితంగా విద్యార్థుల ప్రవేశం, నిష్క్రమణ, అలాగే మొబైల్ ఫోన్‌ల వినియోగానికి సంబంధించి నిబంధనలను రూపొందిస్తారని వివరించారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







