ఫైజర్ వ్యాక్సిన్‌తో మహిళ మృతి..
- August 30, 2021
న్యూజిలాండ్:కరోనా హమ్మారిపై విజయం సాధించడానికి రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. కొన్ని దేశాలు స్వయంగా వ్యాక్సిన్లు తయారు చేస్తే.. మరికొన్ని దేశాలు వాటిని దిగుమతి చేసుకుని తమ ప్రజలకు అందిస్తున్నాయి.అయితే, అక్కడక్కడ వ్యాక్సిన్లు వికటించిన మృతిచెందినట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి.తాజాగా, న్యూజిలాండ్‌లో ఓ మహిళ మృతిచెందారు.. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళ చనిపోయినట్లు న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అత్యంత అరుదైన మయోకార్డిటిస్ అంటే గుండె కండరాల్లో ఇన్ఫ్లేమేషన్తో ఆ మహిళ చనిపోయినట్టు భావిస్తున్నామని.. ఫైజర్ వ్యాక్సిన్ వల్ల దేశంలో సంభవించిన తొలి మరణం ఇదేనని ప్రకటించింది న్యూజిలాండ్. ఇక, ఆ మహిళ ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని కూడా తెలిపింది. మరోవైపు.. ఫైజర్ వ్యాక్సిన్ వల్ల కలిగే అనర్థాల కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని కూడా వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!







