ఘాటుగానే స్పందించిన సమంత
- September 01, 2021
అక్కినేని కోడలు సమంత కొద్ది రోజులుగా వార్తలలో హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడైతే తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి అక్కినేని పేరు తొలగించిందో అప్పటి నుండి అభిమానులలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ సామ్ నుంచి చైతూ నుండి కాని ఎలాంటి స్పందన లేదు.
ఇటీవల ఇంటర్వ్యూలో అక్కినేని పేరు తొలగించడంపై స్పందించమని అడగగా, సమయం వచ్చినప్పుడు నేను సమాధానం చెబుతానని సామ్ అనడంతో సందేహాలు మరికాస్త పెద్దవయ్యాయి. రోజులు గడిచేకొద్దీ సామ్ -చైతన్య మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న పుకార్లు మరింత తీవ్ర తరమవుతున్నాయి. అక్టోబర్ 6న వీరి నాలుగో వివాహవార్షికోత్సవం. ఆ రోజు ఈ జంట తమ రిలేషన్‌కి సంబంధించిన ప్రకటన ఇస్తారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అయితే సోషల్ మీడియా క్వీన్ సమంత తమపై వచ్చే పుకార్లుకు పరోక్షంగా స్పందించింది. మీడియా, రియాలిటీ మధ్య వ్యత్సాసాన్ని చూపిస్తూ.. మేమిద్దరం బాగానే ఉన్నాం. మీడియానే దానిని పెద్దది చేసి చూపిస్తుంది అన్నట్టుగా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. ఇటీవల నాగ్ బర్త్ డే రోజు కూడా సమంత చాలా ప్రేమగా తన మామకు శుభాకాంక్షలు తెలిపింది. అయినప్పటికీ పుకార్లకి బ్రేక్ పడలేదు. సమంత డైరెక్ట్గాఈ విషయంపై వివరణ ఇస్తే కాని పుకార్లకి పులిస్టాప్ పడేలా కనిపించడం లేదు.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







