టాలీవుడ్ సినీతారలకు షాక్.. అప్రూవర్‌గా మారిన నిందితుడు
- September 01, 2021
టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ముందు నిందితుడు కెల్విన్ లొంగిపోయాడు. ఎక్సైజ్ అధికారుల కేసు ఆధారంగా 6 నెలల క్రితం ఈడీ అధికారులు కెల్విన్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, గతంలో ఎక్సైజ్ అధికారుల విచారణలో భాగంగా వారు అడిగిన ప్రశ్నలకు కెల్విన్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఈడీ అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. కెల్విన్ టాలీవుడ్ సినీతారల భాగోతం బయటపెట్టాడు. దీనికితోడు భారీ మొత్తంలో సినీతారల నుంచి కెల్విన్‌కు నగదు బదిలీ కావడంతో.. అతడి అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు అధికారులు. కెల్విన్ స్టేట్మెంట్ ఆధారంగానే సీని ప్రముఖులకు నోటీసులు పంపారు.
భారీ మొత్తంలో నగదు బదిలీ చేసిన సినీతారల బ్యాంక్ అకౌంట్లను కూడా ఈడీ అధికారులు ఫ్రీజ్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు విచారణకు హాజరు అవుతున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ హైదరాబాద్‌లోని ఈడీ అధికారుల ముందు మంగళవారం హాజరవ్వగా.. అతడి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. తాజాగా కెల్విన్ ఈడీ అధికారుల ముందు అప్రూవర్‌గా మారడంతో సదరు సినీ ప్రముఖులు ఇరకాటంలో పడ్డట్టు అయిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







