బీటెక్ చేసిన వారికి గుడ్ న్యూస్.. ఇండియన్ ఆర్మీలో చేరే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి
- September 01, 2021
ఇండియన్ ఆర్మీలో చేరి దేశ రక్షణలో పాలు పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ పురుష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి 134వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం.. ఎంపికైన అభ్యర్థులకు ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్ లోని మిలిటరీ అకాడమిలో శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ జనవరి 2022లో ప్రారంభం అవుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు సెప్టెంబర్ 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ నోటిఫికేకషన్ ద్వారా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
విద్యార్హతల వివరాలు..
ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఫైనలియర్ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకే శిక్షణ ఏడాది పాటు ఉంటుంది. జాబ్ నోటిఫికేషన్ ప్రకారం.. ట్రైనీలకు ఏడాది పాటు నెలకు రూ. 56,100 వరకు స్టైఫండ్ చెల్లిస్తారు. శిక్షణలో చేరినప్పటి నుంచే లెఫ్టినెంట్ హోదా ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శాశ్వత కమిషన్ పరిధిలోకి వస్తారు. ఆ సమయంలో రూ.56,100 నుంచి రూ. 1,77,500 వరకు ఉంటుంది. ఇతర అలవెన్స్ లు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
అప్లై చేసుకున్న అభ్యర్థులకు కట్ ఆఫ్ నిర్ణయిస్తారు. కట్ ఆఫ్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. తర్వాత వైద్య పరీక్షలు ఉంటాయి. వీటి ఫలితాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
అప్లై చేసే విధానం:
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://www.joinindianarmy.nic.in/
Authentication.aspx ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం ‘Officer Entry Apply/Login’ ఆప్షన్ ను ఎంచుకోవాలి. -తర్వాత ‘Registration’పై క్లిక్ చేయాలి.
Step 3: నిబంధనలు మొత్తం చదివిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి.
Step 4: రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: వివరాలు మొత్తం నమోదు చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్‌దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్‌కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







