బహ్రెయిన్, భారత్ విదేశాంగ మంత్రుల భేటీ..ద్వైపాక్షిక బంధంపై డిస్కషన్
- September 02, 2021
మనామా: బహ్రెయిన్ లో అధికార పర్యటలో ఉన్న భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి హెచ్.ఈ.వీ. మురళీధరన్ తో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లాతీఫ్ బిన్ రషీద్ అల్-జయానీ సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య దృఢమైన చారిత్రక స్నేహ సంబంధాలను, అన్ని స్థాయిలలో ఇరు దేశాల మధ్య బలపడుతున్న సహకారాన్ని ప్రశంసిస్తూ బహ్రెయిన్ విదేశాంగ మంత్రి మురళీధరన్‌కు స్వాగతం పలికారు.గత ఏప్రిల్‌లో బహ్రెయిన్, ఇండియా మధ్య న్యూఢిల్లీలో జరిగిన ఉమ్మడి ఉన్నత కమిటీ మంత్రివర్గ సమావేశ ఫలితాలను ఇరు దేశాల మంత్రులు సమీక్షించారు. రెండు స్నేహపూర్వక దేశాల మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపులను క్రమంగా కొనసాగించాలని బహ్రెయిన్ మంత్రి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. బహ్రెయిన్ పర్యటనకు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మురళీధరన్...పరస్పర గౌరవంతో ద్వైపాక్షిక బంధం అడ్వాన్స్ లెవల్ కు చేరుకోటాన్ని ప్రశంసించారు. బహ్రెయిన్ తమ పురోగతిని కొనసాగించాలని కోరుకుంటున్నానని, అందుకు తమ వంతు సహాకారం ఎప్పటికీ ఉంటుందని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







