ఎక్స్‌పో 2020 దుబాయ్: ఫ్లై దుబాయ్ ప్రయాణీకులకు ఫ్రీ డే పాస్

- September 02, 2021 , by Maagulf
ఎక్స్‌పో 2020 దుబాయ్: ఫ్లై దుబాయ్ ప్రయాణీకులకు ఫ్రీ డే పాస్

దుబాయ్: ఫ్లై దుబాయ్ ప్రయాణీకులు ఎక్స్‌పో దుబాయ్ 2020 కోసం కాంప్లిమెంటరీ డే టికెట్ (ఒక్క రోజు కోసం) పొందనున్నారు. 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి కాంప్లిమెంటరీ టిక్కెట్ లభిస్తుంది. ఆరు నెలలపాటు సాగే మెగా ఎగ్జిబిషన్‌ కోసం ఈ టిక్కెట్ ఉపయోగపడుతుంది. ఫ్లై దుబాయ్ ద్వారా ప్రయాణించే ప్రయాణీకులందరికీ ఆ ఆఫర్ వర్తిస్తుంది. ఎక్స్‌పో దుబాయ్ 2020లో 190కి పైగా దేశాలు పాల్గొననున్నాయి.182 రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.అక్టోబర్ 1 నుంచి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. ఒక రోజు టిక్కెట్ ధర 95 దిర్హాములు. వరుసగా 30 రోజులపాటు సందర్శించాలనుకుంటే 195 దిర్హాములు. అన్ లిమిటెడ్ ఎంట్రీ కోసం 495 దిర్హాములు చెల్లించాలి.

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com