ఈ నెల 6న విడుదల కానున్న ‘క్లాప్’ టీజర్
- September 02, 2021
హైదరాబాద్: హీరో ఆది పినిశెట్టి అథ్లెట్‌గా నటిస్తోన్న చిత్రం ‘క్లాప్’. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజీ, ఎం.రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్ ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆది పినిశెట్టి పెద్ద పోటీ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పోస్టర్లో ఆది స్ప్రింటర్‌గా కనిపిస్తున్నారు. పారా ఒలింపిక్స్ లో భారతదేశం మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నందున ఈ సినిమా టీజర్ విడుదలకు ఇది సరైన సమయం అని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమా కోసం ఆది పినిశెట్టి కఠినమైన శిక్షణ తీసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా, ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తుండగా, కృష్ణ కురుప్, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మాజీ, మైమ్ గోపి, మునిష్కాంత్ కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందని, విడుదలకు సిద్ధంగా ఉందని నిర్మాతలు తెలిపారు. ప్రముఖ గీత రచయిత వనమాలి ఈ సినిమాకు మాటలు రాయడం విశేషం.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!









