ఒమన్ కి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ 19 బీమా తప్పనిసరి
- September 03, 2021
ఒమన్: సుల్తానేట్ కి వచ్చే ప్రయాణికులకు ఖచ్చితంగా కోవిడ్ 19 బీమా ఉండాలని ఒమన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుల్తానేట్ కు విమాన సర్వీసులు నడిపే అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలకు సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం నెల రోజుల పాటు ఆస్పత్రి ఖర్చులు కవర్ అయ్యేలా అంతర్జాతీయ బీమా ఉండాలని సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఇప్పటికే వ్యక్తిగత బీమా ఉన్నవారు, కంపెనీల నుంచి బీమా పొందిన వారు కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ప్రయాణానికి ముందు తమ బీమా డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అయితే..ఒమనీ పౌరులకు బీమా నిబంధనలు వర్తించవు. ఇదిలాఉంటే సెప్టెంబర్ 1 నుంచి ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత అమలులోకి రావటంతో వివిధ దేశాల నుంచి సుల్తానేట్ కు వస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









