ట్రాఫిక్ సిబ్బందితో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశం
- September 03, 2021
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని ట్రాఫిక్ సమస్యలపై ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, కూకట్పల్లి, శంషాబాద్, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీలు, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీ సిబ్బందిని అడిగి ముఖ్యంగా కమీషనరేట్లోని ట్రాఫిక్ సమస్యలకు అడిగి తెలుసుకున్నారు.గణేష్ పండుగ దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చేయలు చేపట్టాలన్నారు. వర్షాల కారణంగా ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. యాక్సిడెంట్ లు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా చేయలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో తలెత్తే అత్యవసర ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు భద్రత వంటి అంశాలను ముందస్తుగా ఊహించి అందుకనుగుణంగా తగు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఐటీ & ఐటీఎస్ కంపెనీలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సాఫీగా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సిబ్బంది వినూత్న విధానాలను అవలంబించేందుకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర డీసీపీ ట్రాఫిక్ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఏడీసీపీ శంకర్ నాయక్, బాలానగర్ ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, కూకట్పల్లి ఏసీపీ హనుమంత రావు, ఏసీపీ సంతోష్ కుమార్, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







