75 వేల యాంఫేటమిన్ పిల్స్ పట్టివేత..ముగ్గురు అరెస్ట్

- September 06, 2021 , by Maagulf
75 వేల యాంఫేటమిన్ పిల్స్ పట్టివేత..ముగ్గురు అరెస్ట్

సౌదీ: కింగ్డమ్ లోకి యాంఫేటమిన్ టాబ్లెట్‌లను అక్రమంగా తరలిచేందుకు ప్రయత్నించిన ముఠాను సౌదీ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 75,794 యాంఫేటమిన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ ప్రతినిధి మేజర్ మహ్మద్ అల్-నజీది మాట్లాడుతూ, క్రైమ్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో ఈ డ్రగ్స్ దొరికాయని తెలిపారు. రాజధాని రియాద్‌లో జకాత్, పన్ను, కస్టమ్స్ అధికారులు సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. నిషేధిత మాత్రలను స్వాధీనం చేసుకొని ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో ఇద్దరు సిరియన్లు, ఒక ఈజిప్షియన్‌ ఉన్నారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు మేజర్ అల్-నజిదీ వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com