గ్రీన్ వీసాలు పొందెందుకు అర్హత వివరాలను ప్రకటించిన యూఏఈ

- September 06, 2021 , by Maagulf
గ్రీన్ వీసాలు పొందెందుకు అర్హత వివరాలను ప్రకటించిన యూఏఈ

యూఏఈ: గ్రీన్ వీసా, ఫ్రీలాన్సర్ వీసాలకు సంబంధించి విధివిధానలు, అర్హతల వివరాలను యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్ వీసా, ఫ్రీలాన్సర్ వీసాలపై స్పష్టతనిస్తూ ట్వీట్ ద్వారా వివరాలను వెల్లడించింది. సాధారణంగా యూఏఈలోని ప్రవాసీయులకు వర్క్ పర్మిట్ ఉంటేనే రెసిడెన్సీ పర్మిట్ కు లైన్ క్లియర్ అవుతుంది. కానీ, గ్రీన్ వీసాతో ఈ రెండింటికి లింక్ ఉండదు. వర్క్ పర్మిట్ తో సంబంధం లేకుండానే నివాస అనుమతులు పొందవచ్చు. అయితే..గ్రీన్ వీసా పొందెందుకు ప్రత్యేక అర్హత ఉండాలని తెలిపింది. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులు, అగ్రశ్రేణి విద్యార్థులు, ప్రత్యేక రంగాలలో గ్రాడ్యుయేట్లు గ్రీన్ వీసాకు అర్హులని స్పష్టత ఇచ్చింది.

ఇతర వీసాదారులతో పోలిస్తే గ్రీన్ వీసాదారులకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు ఉంటాయి. గ్రీన్ వీసాదారులను ఇతరులు స్పాన్సర్ చేయాల్సిన అవసరం ఉండదు. వారు స్వయంగా తమను తామే స్పాన్సర్ చేసుకునేందుకు అర్హులు. గ్రీన్ వీసాదారులు వారి తల్లిదండ్రలకు స్పాన్సర్ షిప్ చేయవచ్చు. అలాగే 8 సంవత్సరాలకు బదులు 25 సంవత్సరాల వయస్సు వరకు యువకులకు స్పాన్సర్‌షిప్ ఉంటుంది. ఒవేళ అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం కొల్పోయినా, పదవీ విరమణ పొందినా దేశం విడిచి వెళ్లేందుకు ఇచ్చే గ్రేస్ పీరియడ్‌ను 30 రోజులకి బదులు 90-180 రోజులకు పొడిగించుకోవచ్చు.

ఇదిలా ఉంటే..ఫ్రీలాన్సర్స్ వీసా అర్హతను కూడా యూఏఈ ప్రకటించింది. కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చెయిన్, డిజిటల్ కరెన్సీల వంటి ప్రత్యేక రంగాలలో విదేశాల్లో స్వయం ఉపాధి పొందుతున్న యూఏఈ వ్యక్తులకు ఫ్రీలాన్సర్ వీసా ఇవ్వనున్నట్లు యూఏఈ వెల్లడించింది.  వీసాల జారీ, రెసిడెన్సీ పర్మిట్ విధానాల్లో తీసుకొస్తున్న సవరణలు తమ దేశాన్ని ప్రపంచంలోనే విశిష్ట దేశంగా నిలబెడుతున్నాయని విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి థాని బిన్ అహ్మద్ అల్ జ్యూదీ అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com