వీసా జారీపై ముందుగానే చెబుతాం..స్పష్టతనిచ్చిన కువైట్

- September 06, 2021 , by Maagulf
వీసా జారీపై ముందుగానే చెబుతాం..స్పష్టతనిచ్చిన కువైట్

కువైట్: విజిట్ వీసాలపై కువైట్ రావాలనుకునే వారిని ఉద్దేశించి ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వీసాల జారీపై క్లారిటీ ఇచ్చిది. అన్ని రకాల వీసాల జారీ ప్రక్రియపై ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఒకవేళ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని ముందుగానే తెలియజేస్తామని కూడా తెలిపింది. వచ్చే నెల నుంచి విజిట్ వీసాల జారీ షురూ అవుతుందని స్ధానికంగా వార్త కథనాలు ప్రచురితం అయిన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ మేరకు స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com