NEET EXAM షెడ్యూల్‌ ప్రకారమే : సుప్రీంకోర్టు స్పష్టీకరణ

- September 06, 2021 , by Maagulf
NEET EXAM షెడ్యూల్‌ ప్రకారమే : సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా మెడికల్‌ కాలేజ్‌ ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (యూజీ)-2021 పరీక్ష వాయిదా వేయాలని లేదా రీ షెడ్యూల్‌ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. షెడ్యూల్‌ చేసిన ప్రకారమే అంటే సెప్టెంబర్‌ 12న పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. కరోనా ఉథృతి కారణంగా ఈ మే నెలలో జరగాల్సిన నీట్‌ పరీక్షనూ కేంద్రం వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఆగస్టులో అనుకున్నప్పటికీ ఇంకా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుండటంతో సెప్టెంబర్‌ 12న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అదే రోజు నీట్‌తో పాటు సిబిఎస్‌ఇ కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు కూడా జరుగుతున్నాయని, అందువల్ల పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ పిటిషన్లను తోసిపుచ్చింది. ' నీట్‌ పరీక్షను 16 లక్షల మందికి పైగా విద్యార్థులు రాయనున్నారు. కేవలం కొంత మంది విద్యార్థుల కోసం పరీక్ష వాయిదా వేయడం సరికాదు. విద్యా వ్యవహారాలపై మేం ఎక్కువగా జోక్యం చేసుకోలేం. ఎందుకంటే మా తీర్పులు లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావితం చూపుతుంది. ఒక వేళ ఒకే రోజు ఎక్కువ పరీక్షలు ఉంటే.. ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. అంతేగానీ, నీట్‌ను వాయిదా వేయడం కుదరదు. సెప్టెంబర్‌ 12న పరీక్ష జరుగుతుంది' అని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com