'ప్రవాసి మిత్ర'కు కేంద్ర కార్మిక సంఘంలో సభ్యత్వం

- September 07, 2021 , by Maagulf
\'ప్రవాసి మిత్ర\'కు కేంద్ర కార్మిక సంఘంలో సభ్యత్వం

న్యూ ఢిల్లీ: కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంచే గుర్తించబడిన కేంద్ర కార్మిక సంఘం (సెంట్రల్ ట్రేడ్ యూనియన్) ప్రతిష్టాత్మకమైన సంస్ధ టియుసిసి లోకి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ కు అనుబంధ హోదా (అఫిలియేషన్)  లభించింది. ఈ సంస్థ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల మేరకు పనిచేస్తుంది.

07.09.2021 నాడు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అఫిలియేషన్ సర్టిఫికెట్ ను  టియుసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్పీ తివారి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్లకు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో టియుసిసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. గణేష్ రావు, కార్మిక నాయకులు చాంద్ ఖాన్, లక్కాడి సాయి శంతన్ రెడ్డి, న్యాయవాది షేర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com