ఎక్స్పో 2020: నేటి నుంచి మాక్ డ్రిల్ చేపట్టనున్న దుబాయ్ పోలీస్
- September 07, 2021
యూఏఈ: దుబాయ్ పోలీస్, ఎక్స్పో 2020 పరిసర ప్రాంతాల్లో 48 గంటల పాటు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. నేటి నుంచి (సెప్టెంబర్ 7 మంగళవారం) ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ఈ మెగా ఈవెంట్ అక్టోబర్ 1 న ప్రారంభం కాబోతోంది. కాగా, ఇప్పటికే పలువురు ప్రముఖులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్స్పో 2020 సన్నద్ధతకు సంబంధించి వివరాలను నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. 191 దేశాలు ఈ ఈవెంట్లో పాల్గొననున్నాయి. అబుదాబీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మరియు కమిటీ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ తహ్నౌమ్ మాట్లాడుతూ ఈ ఎక్స్పో అంగరంగ వైభవంగా జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని వినియోగించి, ప్రతి ఒక్కరికీ ఈ కార్యక్రమంలో మెరుగైన సేవలు అందించనుంది దుబాయ్ పోలీస్.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







