జైలులో అగ్నిప్రమాదం: 41 మంది మృతి
- September 08, 2021
జకార్తా: ఇండోనేషియా దేశంలోని బాంటెన్ ప్రావిన్స్ జైలులో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది.ఈ అగ్నిప్రమాదంలో 41 మంది ఖైదీలు మరణించగా, మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో డ్రగ్ కేసుల్లో ఖైదీలున్నారని జైలు అధికారులు చెప్పారు. టంజిరంగ్ జైలు సీ బ్లాకులో మంటలు అంటుకున్నాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. అగ్నిప్రమాదం జరిగిన జైలులో 2వేల మందికి పైగా ఖైదీలున్నారు. అగ్నిప్రమాదం అనంతరం సహాయ చర్యల కోసం వందలాదిమంది పోలీసులు, సైనికులను రంగంలోకి దించారు.
మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకశాఖ వాహనాలను రప్పించారు.బాంటెన్ ప్రావిన్సు జైలులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది మరణించారని ఇండోనేషియా న్యాయ, మానవహక్కుల మంత్రిత్వశాఖ ఆధీనంలోని జైళ్ల శాఖ అధికార ప్రతినిధి రికా అప్రింటి చెప్పారు. జైలులో మంటలు అంటుకోవడంతో సహాయసిబ్బంది ఖైదీలను సురక్షితంగా తరలించేందుకు యత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







