డ్రోన్ ల ద్వారా మందులు, వాక్సిన్ సరఫరా
- September 08, 2021
న్యూ ఢిల్లీ: ప్రస్తుతం మన దేశంలో కరోనా సెగ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకు 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుంది. ఈ సమయంలో డ్రోన్ ల ద్వారా ప్రైమరీ హెల్త్ సెంటర్ లకు మందులు, వాక్సిన్ సరఫరా చేయాలనీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ప్రయోగాత్మకంగా మొదట తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.ఈ నెల 11 న లాంఛనంగా వికారాబాద్ లో దీనిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిందియా, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి హాజరు కానున్నారు. సభ స్థలి, డ్రోన్ లు ఎగిరే ప్రాంతం, మీడియా గ్యాలరీ లను పరిశీలించి కలెక్టర్ కు పలు సూచనలు చేసారు మంత్రి సబితా. దేశ వ్యాప్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండటం తో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







