హైదరాబాద్ నుంచి లండన్‌కు నాన్‌స్టాప్ విమానాలు..
- September 09, 2021
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే విమానాలు మధ్యలో ఆగేవి అయితే తాజాగా ఎయిర్ ఇండియా కొత్తగా నాన్ స్టాప్ విమాన సర్వీలను ప్రారంభించింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమృత్సర్, కొచ్చి, అహ్మదాబాద్, గోవా నుంచి నేరుగా లండన్ నాన్‌స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ఎయిర్ ఇండియా ఈ జాబితాలోకి హైదరాబాద్‌ను కూడా చేర్చింది. అంటే ఇకపై ఎంచక్కా శంషాబాద్‌లో ఫ్లైట్ ఎక్కి నేరుగా లండన్‌లో దిగొచ్చన్నమాట.
ఈ సర్వీసులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. లండన్ నుంచి హైదరాబాద్ బయలు దేరిన నాన్‌స్టాప్ విమానం గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. ఈ విమానంలో మొత్తం 256 సీట్లు ఉంటాయి. వీటిటో 18 బిజినెస్ క్లాస్ కాగా, మిగతా 238 సీట్లు ఎకానమి క్లాస్ సీట్లు ఉంటాయి. ఈ సర్వీసుల్లో భాగంగా ప్రతీ సోమ, శుక్రవారాల్లో హైదరాబాద్ నుంచి లండన్‌కు నాన్‌స్టాప్ విమాన సర్వీసులు నడవనున్నాయి. AI 147 విమానం హైదరాబాద్‌లో సోమవారం రాత్రి 1:30 గంటలకు బయల్దేరి, లండన్‌కు అదే రోజు ఉదయం 7:30 గంటలకు చేరుకుంటుంది.
ఇక ప్రతీ శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు బయల్దేరే విమానం అదేరోజు 11:30 గంటలకు లండన్‌కు చేరుకోనుంది. ఇక లండన్ నుంచి AI 148 విమానం ప్రతీ ఆది, గురువారాల్లో హైదరాబాద్‌కు బయలు దేరనుంది. ఈ విమాన సేవలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం http://www.airindia.in వెబ్సైట్ లేదా.. 1860 233 1407 లేదా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్‌ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









