అవినీతి కేసులో 282 మంది అరెస్ట్
- September 09, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా యాంటీ గ్రాఫ్ట్ అథారిటీ 282 మందిని అవినీతి ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేయడం జరిగింది. అరెస్టయిన వారిలో పౌరులు అలాగే, వలసదారులు ఉన్నారు. ఓవర్‌సైట్ మరియు యాంటీ కరెఫ్షన్ అథారిటీ (నజాహా) వెల్లడించిన వివరాల ప్రకారం, అరెస్టయిన వారిలో కొందరు డిఫెన్స్ మినిస్ర్టీ, ఇంటీరియర్ మినిస్ర్టీ, హెల్త్ మినిస్ర్టీ, జ్యుడీషియల్ మినిస్ర్టీ, మునిసిపల్ మరియు రూరల్ ఎపైర్స్ మరియు హౌసింగ్, ఎన్విరాన్మెంట్ మరియు వాటర్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రీసోర్సెస్ మరియు డెవలప్‌మెంట్, హజ్ మరియు ఉమ్రా, ట్రాన్స్‌పోర్ట్ మరియు లాజిస్టిక్ సర్వీసులు మరియు ఓవర్‌సైట్ అండ్ యాంటీ కరెఫ్షన్ అథారిటీ తదితర విభాగాలకు చెందిన వారున్నారు. లంచం తీసుకోవడం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ తదితర కేసులు నమోదు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ 980 అలాగే, ఈ మెయిల్ [email protected] లేదా ఫ్యాక్స్ నెంబర్ 0114420057 కి అవినీతిపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









