సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి కారణం: మాదాపూర్ ఏసీపీ

- September 11, 2021 , by Maagulf
సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి కారణం: మాదాపూర్ ఏసీపీ

హైదరాబాద్: మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి ఐకియా వైపు తన స్పోర్ట్స్ బైక్‌పై వెళుతున్న సాయి తేజ్ బండి స్కిడ్ అయి కిందపడిపోయారు. అయితే ప్రమాదానికి గురైన సమయంలో లక్కీగా హెల్మెట్ పెట్టుకుని ఉన్నందున తలకు గాయాలు కాలేదని మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు తెలిపారు. రహదారిపై ఇసుక ఉండడం వల్ల బైక్ స్కిడ్ అయిందని.. దాంతో తేజ్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని అన్నారు. ప్రస్తుతం సాయి ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో కుడి కంటి పైభాగంలో, ఛాతి భాగంలో గాయాలయ్యాయి. కాలర్ బోన్ విరిగింది.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మరో 48 గంటలపాటు చికిత్స కొనసాగుతుందని ఈ మేరకు వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com