రెండు వారాల్లో పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకోనున్న ఎయిర్పోర్టు
- September 11, 2021
కువైట్: కరోనా ఎమర్జెన్సీస్ - సుప్రీం కమిటీ, హెల్త్ అథారిటీస్తో కలిసి ఓ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనుంది. ఎయిర్పోర్టు కార్యకలాపాల్ని పూర్తిస్థాయికి తీసుకు రావడం వంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే, రెండు వారాల్లోనే ఎయిర్ పోర్ట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే అవకాశాలు వున్నాయని అథారిటీస్ అభిప్రాయపడుతున్నారు. కరోనా పాండమిక్ విషయమై స్థానిక అలాగే అంతర్జాతీయ పరిస్థితుల్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతుండడం వల్ల, తిరిగి సాధారణ స్థితికి పరిస్థితులు చేరుకుంటాయని అధారిటీస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో రికవరీల పరంగా కువైట్ రెండో స్థానంలో వుంది.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







