తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- September 11, 2021 
            హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 69,833 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 296 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడినవారి సంఖ్య 6,61,302కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 3,893కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 322 మంది కోలుకున్నారు. ఇక, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,52,085కు చేరుకుంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5,324 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 98.60 శాతానికి చేరిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!







