ఇరాక్: విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి
- September 12, 2021
            బాగ్దాద్: ఇరాక్ లో మరోసారి బాంబుల మోత మోగింది. ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రెండు డ్రోన్లతో దాడి జరిగింది. ఈ దాడి జరిగిన ప్రాంతంలో ప్రజలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.అయితే ఈ దాడికి పాల్పడిన వారు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ విమానాశ్రయం సమీపంలో అమెరికన్ కాన్సులేట్ కూడా ఉంది. పేలుళ్ల అనంతరం దట్టమైన పొగ కమ్ముకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతాదళాలు విమానాశ్రయ గేట్లను మూసివేశాయి.శనివారం రాత్రి ఎర్బిల్ విమానాశ్రయం సమీపంలో రెండు సార్లు భారీ శబ్ధాలు వినిపించాయని, చుట్టు పక్కల ప్రాంతాలు మొత్తం నల్లని పొగలు కమ్ముకున్నాయని స్థానికులు వెల్లడించారు. కాగా, విమానాశ్రయం కేంద్రంగా జిహాద్ వ్యతిరేక దళాలు కూడా పనిచేస్తున్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో ఇరాక్‌లో విమానాశ్రయాలపై దాడులు సర్వసాధారణమయ్యాయి.
తాజా వార్తలు
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 







