అది అయిదో టెస్టుగానే ఉండాలి: గంగూలీ
- September 14, 2021
దిల్లీ: కరోనా భయాల వల్ల భారత్, ఇంగ్లాండ్ మధ్య అర్ధంతరంగా ఆగిపోయిన అయిదో టెస్టును తిరిగి ఎప్పుడు నిర్వహించినా.. అది ఈ సిరీస్‌లో భాగంగానే ఉండాలన్నది తమ అభిమతమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరిదైన ఈ మ్యాచ్ ఈ నెల 10న మాంచెస్టర్‌లో ఆరంభం కావాల్సింది. అయితే భారత సహాయ బృందంలో నలుగురు కరోనా బారిన పడటంతో మైదానంలోకి దిగేందుకు కోహ్లీసేన నిరాకరించింది. దీంతో మ్యాచ్ రద్దు చేశారు. ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాలని చూస్తున్న నేపథ్యంలో గంగూలీ స్పందిస్తూ..
''ప్రస్తుత సిరీస్ పూర్తిగా జరగాలి. ఇందులో విజయం సాధిస్తే.. 2007 తర్వాత తొలి సిరీస్ గెలుపవుతుంది. ప్రస్తుతం ఆగిపోయిన టెస్టు మ్యాచ్ ఎప్పుడు జరిగినా.. అది ఈ సిరీస్‌లో అయిదో టెస్టుగానే ఉండాలన్నది మా అభిమతం'' అని గంగూలీ అన్నాడు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







