సైదాబాద్ నిందితుడిపై రూ.10 లక్షల రివార్డ్: సీపీ అంజనీ కుమార్
- September 14, 2021
హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది… ఘటన జరిగి వారం కావస్తున్నా.. నిందితుడు ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.. దీంతో.. హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. సైదాబాద్ చిన్నారి కేసుపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నేతృత్వంలో సమావేశం జరిగింది.. నిందితుడి కోసం 100 మంది పోలీసులతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. 10 పోలీసు బృందాలతో నిందితుడికోసం వేట కొనసాగుతోందని తెలిపారు. ఇదే సమయంలో.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజు ఆచూకీ తెలిపితే రూ.10 లక్షలు రివార్డ్ అందించనున్నట్టు ప్రకటించారు.. నిందితుడి సమాచారం తెలిస్తే 94906 16366, 94906 16627 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.. ఇక, ఆచూకీ తెలిపినవారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్.

తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







