ఉపరాష్ట్రపతిని కలిసిన చిన్న జీయర్ స్వామి

- September 14, 2021 , by Maagulf
ఉపరాష్ట్రపతిని కలిసిన చిన్న జీయర్ స్వామి

న్యూఢిల్లీ: సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపు మాపి సమానత్వ సాధన కోసం కృషి చేసిన భగవద్రామానుజుల వారు ఆధ్యాత్మికవేత్తగానే గాక,  సామాజిక సంస్కరణాభిలాషిగా సమాజంపై చెరగని ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. మంగళవారం నాడు న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసానికి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు విచ్చేశారు. హైదరాబాద్ ముచ్చింతల్ లో 2022 ఫిబ్రవరిలో జరగనున్న 216 అడుగుల సమతా విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ఆవిష్కరణ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి దంపతులకు ఆహ్వానాన్ని అందజేశారు.

సమాజంలో నెలకొన్న వివక్షకు వ్యతిరేకంగా వేయి సంవత్సరాల క్రితమే ఆచరణాత్మక విప్లవాన్ని సృష్టించిన భగవద్రామానుజులు ఆదర్శనీయులన్న ఉపరాష్ట్రపతి,  భగవంతుడు అందరివాడు అంటూ వారు చూపిన మార్గం ఆచరణీయమని తెలిపారు. సామాజిక చైతన్య ప్రబోధకులైన రామానుజుల వారి అతిపెద్ద ప్రతిమను ఏర్పాటు చేయడం ద్వారా, వారి బోధనలు, సందేశం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు అవకాశం ఉంటుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, ధనుష్ ఇన్ఫోటెక్ సి.ఎం.డి. డి.ఎస్.ఎన్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com