క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో GMRIT విద్యార్థులకు అధిక వేతన ఉద్యోగాలు

- September 14, 2021 , by Maagulf
క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో GMRIT విద్యార్థులకు అధిక వేతన ఉద్యోగాలు

హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా రాజాంలోని GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (GMRIT) కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ మరియు సివిల్ ఇంజనీరింగ్‌ని అభ్యసిస్తున్న చెందిన 17 మంది విద్యార్థులు ప్రముఖ మల్టీ-నేషనల్ కంపెనీలలో (MNC) ప్లేస్‌మెంట్‌లను సాధించారు. వీరి ప్యాకేజీలు ఏడాదికి 8 లక్షల నుండి 25 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. ఈ విద్యార్థులు త్వరలో తాము కలలు కంటున్న ఉద్యోగాలలో చేరతారు.

గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం, GMRIT నుంచి అత్యధిక సంఖ్యలో (700+) విద్యార్థులు ప్లేస్‌మెంట్ ఆఫర్‌లను పొందారు. Fortel.UK, Amazon-AWS, Musigma, Infosys, TCS డిజిటల్, కాగ్నిజెంట్ ఈ సంవత్సరం టాప్ రిక్రూటర్ల జాబితాలో ఉన్నాయి.

GMRITను 1997లో GMR గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ విభాగం GMR వరలక్ష్మి ఫౌండేషన్ (GMRVF)కింద స్థాపించారు. అంతర్జాతీయ ప్రమాణాలున్న ఉన్నత, సాంకేతిక విద్యను గ్రామీణ యువకుల చెంతకు తీసుకురావడం GMRIT లక్ష్యం. విద్యార్థులకు అనుభవజ్ఞులు, నిబద్ధత కలిగిన అధ్యాపకుల ఆధ్వర్యంలో, మూడవ సెమిస్టర్ నుండి వివిధ సాంకేతిక, సాంకేతికేతర శిక్షణను GMRIT అందిస్తుంది. అంతే కాకుండా పరిశ్రమలు, పరిశోధన కేంద్రాల నుండి నిపుణులను ఆహ్వానించి వారి ద్వారా అనేక సెమినార్లు, సాంకేతిక చర్చలను నిర్వహిస్తారు.

GMRIT నుంచి ఉత్తీర్ణుడై Fortel.UKలో ఏడాదికి రూ.25 లక్షల ప్యాకేజీ ఫొందిన M. సత్యనాథ్, "నా నైపుణ్యాలను ప్రదర్శించడానికి నాకు లభించిన ఒక గొప్ప అవకాశం ఇది. నేను ఈ స్థితికి చేరుకోవడానికి నాకు సహకరించిన GMRIT కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అన్నారు.

శాఖలతో సంబంధం లేకుండా GMRITలో  విద్యార్థులంతా MNCలు నిర్వహించే లైవ్ హ్యాకథాన్‌లలో పాల్గొనవచ్చు. అంతే కాకుండా ప్రొఫెషనల్ స్టూడెంట్ చాప్టర్‌ల కింద నిర్వహించే కోడింగ్ కార్యకలాపాలు, సాంకేతిక పోటీలు, ఈవెంట్‌లు, చర్చలు మరియు వెబ్‌నార్‌లతో పాల్గొనేలా GMRITలో  విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తారు. దీని ద్వారా వారు ప్లేస్‌మెంట్ అవకాశాలకు సిద్ధం కావచ్చు. 

"నా కలలను నిజం చేసుకోవడంలో GMRIT కీలక పాత్ర పోషించింది. GMRITలోని నా ఉపాధ్యాయులు, అధ్యాపకులు సరైన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను ఎంచుకోవడంలో సహకరించారు. ఇన్‌స్టిట్యూట్‌లో రూపొందించిన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా నా జీవిత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నాను’’ అని Musigmaలో ఏడాదికి 10 లక్షల రూపాయలతో ప్లేస్‌మెంట్ పొందిన M. రోహిణి చెప్పారు.

విద్యార్థుల విజయంపై  వ్యాఖ్యానిస్తూ, GMRIT ప్రిన్సిపాల్ డాక్టర్ సిఎల్‌విఆర్‌ఎస్‌వి ప్రసాద్ "GMRIT కేవలం జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో విజ్ఞానం, నైతికతతో విద్యార్ధుల కెరీర్‌ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్ నిర్మాణం, కోడింగ్, వ్యవస్థాపకతపై మేం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం. ఇక్కడ విద్యార్థులను వివిధ సింపోజియమ్స్, టెక్నికల్ ఫెస్ట్‌లు, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కోడింగ్ పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తాం. విద్యార్థులు తమ కలలను నిజం చేసుకోవడానికి GMRIT ఒక సరైన లాంచ్ ప్యాడ్‌గా ఉపయోగపడుతుంది’’ అన్నారు.

C, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్, డేటాబేసెస్, నెట్‌వర్క్‌స్ అండ్ అడ్వాన్స్‌డ్ కోర్సెస్ వంటి అన్ని శాఖలలోని ప్రాథమిక కోర్సుల సహాయంతో పరిశ్రమ అవసరాలను తీర్చే విధంగా GMRITలో పాఠ్యప్రణాళికలను రూపొందించారు. GMRITలో మరొక అదనపు ఆకర్షణ – లేబరేటరీలు. ఇక్కడ విద్యార్థులు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, కంటెంట్‌పై అనేక ప్రయోగాలు చేస్తారు. దీని వల్ల సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ యొక్క కొత్త వెర్షన్‌లతో ట్రబుల్ షూటింగ్ నైపుణ్యాలు మెరుగవుతాయి. 

GMRIT లో ప్రతి విద్యార్థికి 300 గంటల ఉపాధి నైపుణ్య శిక్షణా కార్యక్రమం ద్వారా సాఫ్ట్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, కోడింగ్ మరియు టెక్నికల్ స్కిల్స్ ట్రైనింగ్‌ ఇస్తారు. సబ్జెక్ట్ నిపుణుల ద్వారా విద్యార్థులకు ప్రత్యేక గేట్ కోచింగ్ ఇవ్వబడుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ సెల్ (EDC) ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌పై శిక్షణ కూడా ఉంటుంది. వారి స్వంత స్టార్టప్‌లను స్థాపించేలా కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com