తెలంగాణకు కేంద్రం శుభవార్త..
- September 14, 2021
హైదరాబాద్: తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల నిర్మాణానికి స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద కేంద్రం రూ.300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. స్వదేశ్ దర్శన్ పథకంలో రాష్ట్రంలో 3 పర్యాటక సర్క్యూట్స్ అభివృద్ధికి రూ.268.39 కోట్లు, ప్రసాద్ పథకం కింద రూ.36.73 కోట్ల మంజూరు చేసింది. బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాసిన లేఖకు సమాధానమిస్తు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని ఎకో సర్క్యూట్ కోసం 2015-16లో రూ.91.62 కోట్లు, ములుగు-లక్నవరం-మేడారం-తాడ్వయి-దామరవి-మల్లూరు-బొగత జలపాతంను కలుపుతూ ట్రైబల్ సర్క్యూట్ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు 2016-17లో రూ.79.87 కోట్లు, కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్-పైగా టూంబ్స్- హయత్ బక్షి మస్క్ –రేమండ్స్ టూంబ్ లను కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు 2017-18లో రూ.96.90 కోట్లు మంజూరు చేసినట్టు లేఖలో పేర్కొన్నారు.
ప్రసాద్ పథకం కింద ఆలంపూర్ లోని జోగులాంబ దేవి అమ్మవారి ఆలయం అభివృద్ధికి 2020-21లో రూ.36.73 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపిస్తే, వాటిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన







