ఆర్బీఐ కీలక నిర్ణయం, ఇకపై విదేశాల్లో సైతం కూడా యూపీఐ చెల్లింపులు
- September 15, 2021
ఆన్‌లైన్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపేందుకు వీలుగా ఒప్పందాలు చేసుకుంటోంది.
జీ 20 దేశాలతో
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ సౌకర్యం 2016లో అందుబాటులోకి వచ్చింది. ఆరంభంలో అడుగులు నెమ్మదిగా పడినా ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ సర్వసాధారణ విషయంగా మారింది. టీ కొట్టు, పాన్ డబ్బా దగ్గర కూడా యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. అయితే విదేశాల్లో ఉన్న వ్యక్తులకు డబ్బులు పంపడం ఇబ్బందిగా మారింది. ఈ కష్టాలు తొలగించే దిశగా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా తొలుత జీ 20 దేశాలతో ఈ మేరకు అవగాహనకు రావాలని నిర్ణయించింది.
తొలుత సింగపూర్
భారత్ , సింగపూర్ దేశాల మధ్య ఆన్‌లైన్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానేటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇండియాలోని యూపీఐ యూజర్లు సింగపూర్‌లో ఉన్న పే నౌ యౌజర్లతో తేలికగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కలగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. 2022 జులై నుంచి ఇండియా, సింగపూర్ దేశాల మధ్య యూపీఐ చెల్లింపుల నిర్ణయం అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







