వదిలివేయబడ్డ ఇళ్ళ వ్యవహారంపై సుల్తాన్ ఆదేశాలు
- September 15, 2021
షార్జా: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, షార్జాలో వదిలివేయబడ్డ ఇళ్ళ విషయమై షార్జా డిప్యూటీ రూలర్, ఛైర్మన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. షార్జా మునిసిపాలిటీ తరఫున ఏర్పాటైన కమిటీ, ఆ ఇళ్ళ సంఖ్యను లెక్కిస్తోంది. వాటికి సంబంధించిన సమస్యల్ని గుర్తిస్తోంది. షార్జా అభివృద్ధిపై షేక్ సుల్తాన్ ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. 2022 సంవత్సరాన్ని కల్బాగా, ఆ తర్వాత వచ్చే ఏడాదిని అల్ ధయిద్‌గా సుల్తాన్ పేర్కొన్నారు. ప్రతి 6 నుంచి 8 నెలలకు ఓ సారి ఓ పెద్ద కొత్త ప్రాజెక్టుని ప్రారంభించనున్నట్లు సుల్తాన్ వెల్లడించారు. షార్జాని అన్ని రకాలుగా మరింత అభివృద్ధి చేయాల్సి వుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







