ఇండియాతో వ్యూహాత్మక మైత్రి బంధమే లక్ష్యంగా సౌదీ అడుగులు
- September 21, 2021
న్యూ ఢిల్లీ: భారత్ తో వ్యూహాత్మక మైత్రి బంధాన్ని బరింత బలోపేతం చేసుకోవటం..విజన్ 2030 లక్ష్యానికి అనుగుణంగా పరస్పర పెట్టుబడులు..ఇతర రంగాల్లో సహాకరం అందింపుచ్చుకోవటం లక్ష్యంగా సౌదీ విదేశాంగ మంత్రి భారత పర్యటన కొనసాగింది. రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ తన పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. రెండు దేశాలు పరస్పర సహాకారంతో ప్రస్తుత మహమ్మారి సంక్షోభ పరిస్థితులను అధిగమించాలని ఆశిస్తున్నట్లు ఆయన మోదీతో అన్నారు. ఆర్ధిక, పరస్పర వాణిజ్యం, పెట్టుబడులు ఇరు దేశాల మైత్రికి ఓ పిల్లర్ అని అభిప్రాయపడ్డారు. భారత్ లో గత ఐదేళ్లలోనే సౌదీ పెట్టుబడులు 6 రెట్లు పెరిగాయని..2014లో 60 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడితే..ప్రస్తుతం 350 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు సౌదీ విదేశాంగ మంత్రి వివరించారు. అదే సమయంలో సౌదీ 2030 విజన్ కు అనుగుణంగా భారత్ వైపు నుంచి కూడా పెట్టుబడులను ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఇది రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉండాలని అభిలాశించారు. ఇదిలాఉంటే భారత్ తో సౌదీ స్నేహబంధం దక్షిణాసియాలోనే వ్యూహాత్మక మైత్రి అని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









