'రానా నాయుడు' లో బాబాయ్ అబ్బాయి
- September 22, 2021ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు నటిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ కలిసి 'ఆచార్య' సినిమాలో కలిసి నటిస్తున్నారు. మరోవైపు నాగార్జున, నాగ చైతన్య కూడా 'బంగార్రాజు' సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇక వెంకటేష్ కూడా తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'ప్రేమమ్'తో పాటు 'వెంకీ మామ' సినిమాలో కలిసి నటించారు. ఇపుడు వెంకటేష్.. తన అన్నయ్య కుమారుడు రానా దగ్గుబాటితో కలిసి పూర్తి స్థాయిలో కలసి నటించబోతున్నారు. కానీ వీరిద్దరు కలిసి సినిమాలో కాకుండా.. నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
'రానా నాయుడు' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. గతంలో వీళ్లిద్దరు 'కృష్ణం వందే జగద్గురుం' సినిమాలో ఓ పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు. ఇపుడు ఆ కోరిక ఈ వెబ్ సిరీస్‌తో నెరవేరనుంది. దీంతో రానా ఎంతో భావోద్వేగానికి గురవుతూ తన గురువు గారైన బాబాయితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్