క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- May 18, 2024
లియోన్: సౌదీ అరేబియా అధికారికంగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC)లో చేరింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రత్యేక ఏజెన్సీ. ఫ్రాన్స్‌లోని లియోన్‌లో జరిగిన IARC గవర్నింగ్ కౌన్సిల్ 66వ సెషన్‌లో ఈ మేరకు ప్రకటించారు. సౌదీ హెల్త్ కౌన్సిల్ సెక్రటరీ-జనరల్ డాక్టర్ నహర్ అల్-అజెమి మాట్లాడుతూ.. IARCలో సౌదీ అరేబియా సభ్యత్వం క్యాన్సర్ మరియు దాని సంబంధిత సవాళ్లను శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఎదుర్కోవడంలో దోహదం పడుతుందన్నారు. సౌదీ అరేబియా విస్తృత ఆరోగ్య వ్యూహంలో భాగంగా జాతీయ మరియు ప్రపంచ స్థాయిలో క్యాన్సర్‌తో పోరాడడంలో దాని సామర్థ్యాలను మెరుగుపరుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్‌లోని సౌదీ అరేబియా రాయబారి ఫహాద్ అల్-రువైలీ, యునెస్కో శాశ్వత ప్రతినిధి అల్-అజెమీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో పాటు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..