కమలాహారిస్‌ను భారత్ కు ఆహ్వానించిన ప్రధాని మోదీ
- September 24, 2021
అమెరికా: ప్రధాని మోదీ శుక్రవారం అమెరికా వెస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇండియా - అమెరికా నేచురల్ పార్టనర్స్ అని కొనియాడారు మోదీ. మ్యూచువల్, గ్లోబల్ ఇంటరస్ట్ అంశాలపై జరిగిన చర్చల్లో ఇద్దరు లీడర్లు పాల్గొన్నారు.
'ఇండియా, అమెరికాలు నేచురల్ పార్టనర్స్. మాకు సామీప్య విలువలు, భౌగోళిక రాజకీయ ఆసక్తులు ఉన్నాయి' అని పీఎం మోదీ.. హారిస్ తో పాటు పాల్గొన్న సమావేశంలో వెల్లడించారు. ఇండియా, అమెరికాలు అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగి ఉన్నాయి. ఇరు దేశాల విలువలు, సహకారం క్రమంగా పెరుగుతూనే ఉంది.ఇండియాలో కొవిడ్ సంక్షోభం గురించి జూన్ నెలలో పీఎం మోదీతో మాట్లాడిన కమలాహారిస్.. నేరుగా మోదీని కలవడం ఇదే తొలిసారి.
'మన ద్వైపాక్షిక సంబంధాలు ప్రెసిడెంట్ జో బైడెన్ సమక్షంలో మరో స్థాయికి చేరతాయని వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ అన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో చాలా మందికి ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా కమలాహారిస్ ను ఇండియాకు ఆహ్వానించారు మోదీ.
4 రోజుల పర్యటన నేపథ్యంలో అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రధాని మోదీ. క్వాల్కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, జనరల్ అటమిక్స్, బ్లాక్‌స్టోన్ కంపెనీలకు సంబంధించిన ఐదుగురు సీఈవోలతో చర్చలు నిర్వహించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సుగాతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







