ప్రత్యేక దర్శనం టికెట్ల ఆన్లైన్ బుకింగ్ పై క్లారిటీ ఇచ్చిన టీటీడీ
- September 24, 2021
తిరుమల: టీటీడీ ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ పనితీరు మెరుగుపరచడం కొరకు తీసుకున్న చర్యలు ఫలించాయి.గడిచిన రెండు మూడు నెలలుగా కోవిడ్ కారణంగా విడుదల చేసిన టిక్కెట్లు పరిమిత సంఖ్యలో ఉండడం వలన చాలామంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి లక్షలాదిగా బుక్ చేసుకోవడానికి ప్రయత్నించడం కారణంగా టీటీడీ ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ లో సాంకేతిక లోపాలు తలెత్తడం జరిగింది.
దీనిని అతిక్రమించడం కోసం ఉన్న అతి తక్కువ సమయంలో (20 రోజులు) వివిధ మార్గాలను అన్వేషించి సాంకేతిక నిపుణుల సూచనలు పరిగణలోకి తీసుకుని AWS వంటి క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కి వెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ఆ సమయంలో జియో యాజమాన్యం వారు తిరుమల శ్రీవారికి సేవ లాగ భావించి అన్నీ తామై సుమారు 2, 3 కోట్ల రూపాయల విలువ చేసే సర్వీస్ ను ఉచితంగా అందించడం జరిగింది.
ఈ రోజు అనగా 24వ తేదీ తొమ్మిది గంటలకి తొలిసారిగా జియో క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసిన సమయంలో కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తినా వెంటనే తగు చర్యలు చేపట్టి పరిష్కరించారు. సుమారు గంట సమయంలోనే 200000 టికెట్లు బుక్ చేసుకోగలిగారు.
తక్కువ సమయం ఉండటం కారణంగా తిరుపతి బాలాజీ పేరుతో సబ్ డొమైన్ తీసుకు రావడం కుదరదు కనుక జియో వారి సాఫ్ట్వేర్ మరియు క్లౌడ్ వాడుకుని టీటీడీ అఫీషియల్ వెబ్ సైట్ ని ల్యాండింగ్ పేజీ గా వాడుకుని జియో మార్ట్ సబ్ డొమైన్ కి రూట్ చేయడం జరిగింది.
తదుపరి టికెట్ల విడుదల సమయంలో ఈ సబ్ డొమైన్ కూడా తిరుపతి బాలాజీ పేరుతో ఉండబోతుంది. శ్రీవారి భక్తులు ఎవరు కూడా దుష్ప్రచారాలు నమ్మకండి.
తాజా వార్తలు
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి







