కోర్టు రూలింగ్‌ని బట్టి వలసదారుల వర్క్ పర్మిట్ రద్దు

- September 24, 2021 , by Maagulf
కోర్టు రూలింగ్‌ని బట్టి వలసదారుల వర్క్ పర్మిట్ రద్దు

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ రెసిడెన్స్ పర్మిట్లను రద్దు చేసే క్రమంలో వలసదారులు తమ వర్క్ పర్మిట్ల రద్దు కోరుతూ దరఖాస్తు చేసుకునే అంశం, కోర్టు తీర్పులకు లోబడి మాత్రమే ఆధారపడి వుంటుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ పేర్కొంది. ఎలక్ట్రానిక్ విధానంలో వర్క్ పర్మిట్ క్యాన్సిలేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేయాలి. భౌతికంగా ఎంప్లాయర్ హాజరు కావాలి లేదా రిజిస్టర్డ్ ప్రతినిథి అయినా వుండాలి. సదరు వలసదారుడిపై కోర్టు తీర్పుని బట్టి క్యాన్సిలేషన్ ఆధారపడి వుంటుంది. 250 కువైటీ దినార్ల విలువైన ఫైనాన్షియల్ గ్యారంటీ తప్పనిసరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com