ఎల్.ఎమ్.ఆర్.ఏ సంయుక్త తనిఖీలు

- September 28, 2021 , by Maagulf
ఎల్.ఎమ్.ఆర్.ఏ సంయుక్త తనిఖీలు

మనామా: నిబంధనలు పాఠించని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వలసదారుల్ని దేశం నుంచి బయటికి పంపనున్నారు. ఈ మేరకు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తగు చర్యలు తీసుకుంటోంది. నార్తరన్ గవర్నరేట్‌లో ఎల్.ఎమ్.ఆర్.ఏ నిర్వహించిన తనిఖీల్లో పలువురు ఉల్లంఘునుల్ని అరెస్టు చేయడం జరిగింది. నేషనాలిటీ, పాస్‌పోర్టులు మరియు రెసిడెన్సీ ఎఫైర్స్, అలాగే నార్తరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ సహకారంతో ఈ తనిఖీలు, అరెస్టులు జరిగాయి. మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. ఉల్లంఘనలపై ఎల్.ఎమ్.ఆర్.ఏ కమ్యూనికేషన్ సెంటర్ 17506055 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com