60 ఏళ్ళ పైబడినవారికి వర్క్ పర్మిట్ : నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి వుంది

- September 28, 2021 , by Maagulf
60 ఏళ్ళ పైబడినవారికి వర్క్ పర్మిట్ : నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి వుంది

కువైట్: సెప్టెంబర్ 27, సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో 60 ఏళ్లు పైబడిన వలసదారులకు వర్క్ పర్మిట్ విషయమై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే, తదుపరి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశముంది. కాగా, 18 నెలల తర్వాత స్కూళ్లు తెరచుకోనుండడంపై క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. అరబిక్ స్కూళ్లు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. కాగా, సెప్టెంబర్ 26 నుంచి విదేశీ స్కూళ్లు ప్రారంభమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com