విద్యార్థులకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్స్

- September 28, 2021 , by Maagulf
విద్యార్థులకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్స్

కువైట్: వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టం లేని విద్యార్ధులు, టీచర్ల కోసం ర్యాపిడ్, యాంటిజెన్ టెస్ట్ కిట్స్‌ను అందుబాటులో ఉంచాలని కువైట్ వైద్య వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబర్ 3 నుంచి విద్యా సంస్థలు తెరుచుకుంటుండడంతో 6 వైద్య కేంద్రాల్లో విద్యార్ధులు, టీచర్లకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే, లేబొరేటరీలు, ఫార్మసీల్లో కూడా కిట్లను విరివిగా అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. రెండు రోజుల్లో పెద్ద సంఖ్యలో కిట్స్ దిగుమతి కానున్నాయి. వీలైనంత వేగంగా వాటిని ఆయా వైద్య కేంద్రాలు, ప్రైవేటు ఫార్మసీలకు తరలిస్తారు. కేవలం 15 నిముషాల్లోనే ఫలితం రావడం ఈ కిట్స్ ప్రత్యేకత. ప్రైవేట్ సెక్టారులో ఈ కిట్ ధర 3 కువైటీ దినార్లకు మించకూడదని అధారిటీస్ భావిస్తున్నాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com