విద్యార్థులకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్స్
- September 28, 2021
కువైట్: వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టం లేని విద్యార్ధులు, టీచర్ల కోసం ర్యాపిడ్, యాంటిజెన్ టెస్ట్ కిట్స్‌ను అందుబాటులో ఉంచాలని కువైట్ వైద్య వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబర్ 3 నుంచి విద్యా సంస్థలు తెరుచుకుంటుండడంతో 6 వైద్య కేంద్రాల్లో విద్యార్ధులు, టీచర్లకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే, లేబొరేటరీలు, ఫార్మసీల్లో కూడా కిట్లను విరివిగా అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. రెండు రోజుల్లో పెద్ద సంఖ్యలో కిట్స్ దిగుమతి కానున్నాయి. వీలైనంత వేగంగా వాటిని ఆయా వైద్య కేంద్రాలు, ప్రైవేటు ఫార్మసీలకు తరలిస్తారు. కేవలం 15 నిముషాల్లోనే ఫలితం రావడం ఈ కిట్స్ ప్రత్యేకత. ప్రైవేట్ సెక్టారులో ఈ కిట్ ధర 3 కువైటీ దినార్లకు మించకూడదని అధారిటీస్ భావిస్తున్నాయ్.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







